Share News

మన్యంపై మంచు తెర

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:34 PM

మన్యంలో వాతావరణం మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

మన్యంపై మంచు తెర
పాడేరు- అరకులోయ హైవేలో చింతలవీధి వద్ద గురువారం ఉదయం పొగమంచు

క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

జి.మాడుగులలో 14 డిగ్రీలు నమోదు

పాడే రు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మన్యంలో వాతావరణం మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురవడంతో పాటు తొమ్మిది గంటలకు గాని సూర్యుడు కనిపించని పరిస్థితి ఉంది. పాడేరు మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో జి.మాడుగులలో 14.2 డిగ్రీలు నమోదు కాగా, అరకులోయలో 14.9, డుంబ్రిగుడలో 15.5, ముంచంగిపుట్టులో 15.7, హుకుంపేటలో 16.0, పెదబయలులో 16.3, పాడేరులో 16.7, చింతపల్లిలో 17.0, కొయ్యూరులో 21.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Nov 06 , 2025 | 11:34 PM