మంచు కురిసే... వలిసె విరిసే..
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:32 PM
మన్యంలో ప్రస్తుతం ఉదయం వేళల్లో మంచు కురుస్తుండడంతో ప్రకృతి అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి.
మన్యంలో ఆకట్టుకుంటున్న వలిసె పూల అందాలు
పెదబయలు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ప్రస్తుతం ఉదయం వేళల్లో మంచు కురుస్తుండడంతో ప్రకృతి అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన్యానికే వన్నె తెచ్చేలా ఉండే పచ్చని వలిసె పూలు మంచుకురిసే వేళలో మరింత విశేషంగా ఆకర్షిస్తుండడంతో ప్రకృతి ప్రియులు మురిసిపోతున్నారు. మండలంలోని పన్నెడ గ్రామానికి సమీపంలో మంచు ముసుగులో వలిసె పూల అందాలను ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాలో బంధించింది.