Share News

సాఫీగా సాగునీరు

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:34 AM

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాగునీటి పారుదల సలహా మండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు.

సాఫీగా సాగునీరు
తాండవ జలాశయం (ఫైల్‌ ఫొటో)

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి

తాండవ ఆయకట్టు 8 నుంచి నీరు విడుదల

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాగునీటి పారుదల సలహా మండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ జలాశయాల నుంచి సాగునీరు విడుదల చేసేందుకు తేదీలను ఖరారు చేశామని పేర్కొన్నారు. రిజర్వాయర్ల నుంచి నీటి వృథాను అరికట్లడంతోపాటు ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కోనాం, పెద్దేరు జలాశయాల నుంచి శుక్రవారం నీటిని విడుదల చేయగా, ఈ నెల 29న రైవాడ జలాశయం నుంచి, ఆగస్టు 8న తాండవ జలాశయం, 12న కల్యాణపులోవ రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:34 AM