Share News

చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:45 PM

మండలంలోని కిల్లోగుడ గ్రామంలో చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను శనివారం కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ప్రారంభించారు.

చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

డుంబ్రిగుడ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని కిల్లోగుడ గ్రామంలో చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను శనివారం కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని, వాటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. చిరు ధాన్యాలతో అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచామని సూచించారు. పర్యాటకులకు సాధారణ ఆహారం కాకుండా ఏజెన్సీ వంటకాలను రుచి చూపించాలని సంజీవని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు తెలిపారు. అనంతరం చిరు ధాన్యాలతో తయారు చేసే ఫలహార శాలను ప్రారంభించారు. అనంతరం కిల్లోగుడ గ్రామంలో మంజూరైన హోం స్టేలను పరిశీలించారు. అక్కడ నుంచి బల్యాగుడ గ్రామంలో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రంలో విస్తరాల తయారీని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్‌వీ నంద్‌, సంజీవని స్వచ్ఛంద ఎన్జీవో దేవుళ్లు, డీపీఎఫ్‌ భాస్కర్‌, ఎంపీడీవో ప్రేమ్‌ సాగర్‌, తహశీల్దార్‌ త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:45 PM