Share News

మందకొడిగా డిగ్రీ ప్రవేశాలు

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:43 AM

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు మందకొడిగా సాగుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఇప్పటికే పూర్తికాగా.. మొత్తం మీద సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. నర్సీపట్నం, ఎలమంచిలి, నక్కపల్లి, సబ్బవరం కళాశాలల్లో ప్రవేశాలు ఒకింత మెరుగ్గా వున్నాయి. చోడవరంలో సగానికిపైగా సీట్లు ఖాళీగా వున్నాయి. మాడుగుల కళాశాలలో 17.3 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటర్‌ పరీక్షలు పలితాలు విడదల కాగా, ఉన్నత విద్యాశాఖ అధికారులుసెప్టెంబరు వరకు డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు చేపట్ట లేదు. దీంతో పలువురు విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరారు. ఈ కారణంగానే మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు చాలా వరకు మిగిలాయి. కాగా రెండో విడత అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో అక్టోబరు మూడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. ఆరో తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు వుంది. 10వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 13వ తేదీలోగా విద్యార్థులు తమకు సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి వుంటుంది.

మందకొడిగా డిగ్రీ ప్రవేశాలు
నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో సగానికిపైగా సీట్లు ఖాళీ

నర్సీపట్నం, ఎలమంచిలి, నక్కపల్లి, సబ్బవరం కళాశాలల్లో ఒకింత మెరుగు..

మాడుగుల కళాశాలలో అధ్వానం

మొదటి విడత కౌన్సెలింగ్‌లో 17.3 శాతం సీట్లు మాత్రమే భర్తీ

రెండో విడత ప్రవేశాలకు 3వ తేదీ వరకు రిజిస్ర్టేషన్‌

10న సీట్ల కేటాయింపు, 13లోగా కళాశాలలో రిపోర్ట్‌

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు మందకొడిగా సాగుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ ఇప్పటికే పూర్తికాగా.. మొత్తం మీద సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. నర్సీపట్నం, ఎలమంచిలి, నక్కపల్లి, సబ్బవరం కళాశాలల్లో ప్రవేశాలు ఒకింత మెరుగ్గా వున్నాయి. చోడవరంలో సగానికిపైగా సీట్లు ఖాళీగా వున్నాయి. మాడుగుల కళాశాలలో 17.3 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటర్‌ పరీక్షలు పలితాలు విడదల కాగా, ఉన్నత విద్యాశాఖ అధికారులుసెప్టెంబరు వరకు డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు చేపట్ట లేదు. దీంతో పలువురు విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరారు. ఈ కారణంగానే మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు చాలా వరకు మిగిలాయి. కాగా రెండో విడత అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో అక్టోబరు మూడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. ఆరో తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు వుంది. 10వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 13వ తేదీలోగా విద్యార్థులు తమకు సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి వుంటుంది.

నర్సీపట్నంలో 55 శాతం సీట్లు భర్తీ

నర్సీపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖ నర్సీపట్నంలోని అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ఫస్టియర్‌లో 300 సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు సీట్లు కేటాయించింది. ఆయా కోర్సుల్లో చేరడానికి మొదటి విడత కౌన్సెలింగ్‌లో 191 మంది దరఖాస్తు చేసుకోగా 165 సీట్లు భర్తీ అయ్యాయి. బీఏ హిస్టరీలో 40 సీట్లకుగాను 26 మంది ప్రవేశం పొందారు. బీఏ పొలిటికల్‌ సైన్స్‌లో 40 సీట్లకు ఏడుగురు, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 60 సీట్లకు 37 మంది చేరారు. బీఎస్సీ బోటనీలో 40 సీట్లకు 27 మంది, బీఎస్సీ కెమిస్ట్రీ 40 సీట్లకు 23 మంది, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో 40 సీట్లకు 38 మంది, బీఎస్సీ ఫిజిక్స్‌ 40 సీట్లకు ఏడుగురు మాత్రమే చేరారు. ఏటా సెప్టెంబరు చివరినాటికి మూడో విడత అడ్మిషన్లు పూర్తయ్యేవి. కానీ ఈ ఏడాది ఇంతవరకు ఒకసారి మాత్రమే కౌన్సెలింగ్‌ జరిగింది. గత విద్యా సంవత్సరంలో 300 సీట్లకుగాను 264 సీట్లు భర్తీ అయ్యాయి.

నక్కపల్లిలో బీఎస్సీ కెమిస్ర్టీ, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌కు ఆదరణ

నక్కపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరంలో బీఎస్సీ, బీఏ, బీకాం కోర్సుల్లో 235 సీట్లు వున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 150 సీట్లు భర్తీ అయ్యాయి. బీఎస్సీ కెమిస్ర్టీ, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కళాశాలలో కోర్సుల వారీగా వున్న సీట్లు, భర్తీ అయినవి, ఖాళీలకు సంబంధించి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.శివయ్య తెలిపిన వివరాలిలా వున్నాయి. బీఎస్సీ (కెమిస్ర్టీ)లో 55 సీట్లకు 45 భర్తీ అయ్యాయి. బీఎస్సీ (మ్యాథ్స్‌)లో 40 సీట్లకు 19, బీఎస్సీ (జువాలజీ)లో 40 సీట్లకు 15, బీఎస్సీ (బోటనీ)లో 40 సీట్లకు 13, బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)లో 60 సీట్లకు 49, బీఏ (హిస్టరీ)లో 40 సీట్లకు 9 భర్తీ అయ్యాయి. మొత్తం 150 సీట్లు నిండగా, ఇంకా 105 సీట్లు ఖాళీగా వున్నాయి.

సబ్బవరంలో 60 శాతం సీట్లు భర్తీ

సబ్బవరం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం డిగ్రీల్లో కోర్సుల్లో 60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బీఏ, బీఎస్సీ, బీకాంలో మొత్తం 290 సీట్లు వుండగా, 173 సీట్లు భర్తీ అయ్యాయి. బీఎస్సీ (ఫిజిక్స్‌)లో 40 సీట్లకుగాను ముగ్గురు మాత్రమే చేరారు. బీఎస్సీ (బోటనీ) 50 సీట్లకు 13 మంది, బీఎస్సీ (కెమిస్ట్రీ)లో 40 సీట్లకు 36 మంది, బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)లో 50 సీట్లకు 43 మంది, బీఏ (హిస్టరీ)లో 40 సీట్లకు 29 మంది, బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)లో 70 సీట్లకు 49 మంది చేరారు. ఇంకా 117 సీట్లు ఖాళీగా వున్నాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.శంకర్‌ తెలిపారు.

చోడవరంలో సగానికిపైగా సీట్లు ఖాళీ

చోడవరం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో మొత్తం 260 సీట్లు వున్నాయి. మొదటి విడత ప్రవేశాల్లో 124 సీట్లు భర్తీ అయ్యాయి. బీఎస్సీ కంప్యూటర్స్‌ మినహా మిగిలిన కోర్సుల్లో చాలా వరకు సీట్లు భర్తీ కాలేదు. బీఏ (ఎకనామిక్స్‌)లో 60 సీట్లకు 11, బీకాంలో 60 సీట్లకు 32, బీఎస్సీ (జువాలజీ)లో 60 సీట్లకు 16, బీఎస్సీ (కెమిస్ట్రీ)లో 40 సీట్లకు 26, బీఎస్సీ (కంప్యూటర్స్‌) 40 సీట్లకు 39 భర్తీ అయ్యాయి.

మాడుగులలో 17.3 శాతం సీట్లు మాత్రమే భర్తీ

మాడుగుల రూరల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూపుల్లో మొత్తం 260 సీట్లు వుండగా, తొలి విడత 45 సీట్లు (17.3 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. బీఎస్సీ (మేఽథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) 40 సీట్లకు 13 మంది, బీఎస్సీ (బోటనీ) లో 40 సీట్లకు నలుగురు , బీఎస్సీ (జువాలజీ)లో 40 సీట్లకు నలుగురు, బీకాం కంప్యుటర్స్‌లో 60 సీట్లకు 13 మంది, బీఏ హిస్టరీలో 40 సీట్లకు 11 మంది మాత్రమే చేరారు. బీఏ పొలిటికల్‌ సైన్స్‌ గ్రూపులో ఒక్కరు కూడా చేరలేదు.

ఎలమంచిలిలో ఆశాజనకంగా ప్రవేశాలు

ఎలమంచిలి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ఒకింత ఆశాజనంగానే వున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో మొత్తం 275 సీట్లకుగాను 175 మంది ప్రవేశాలు పొందారు. మరో వంద సీట్లు ఖాళీగా వున్నాయి.

ఏఎంఏఎల్‌ కళాశాలలో...

కొత్తూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏకైక ఎయిడెడ్‌ కళాశాల అయిన అనకాపల్లి ఏఎంఏఎల్‌ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం బికాంలో 240 సీట్లు, బీఎస్సీలో 350 సీట్లు వున్నాయి. మొదటి విడతలో మొత్తం 590 సీట్లకుగాను 173 మంది మాత్రమే చేరారు. బీకాంలో 16 మంది, బీఎస్సీ బోటనీలో 14 మంది, కెమిస్ర్టీలో 46 మంది, సీఎస్‌సీలో 34 మంది, కెమిస్ర్టీ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌)లో 14 మంది, అగ్రికల్చర్‌ ఒకేషనల్‌లో 11 మంది, డీఏహెచ్‌ ఒకేషనల్‌లో 38 మంది చేరారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.జయబాబు తెలిపారు. ఇంకా 417 సీట్లు అందుబాటులో వున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 12:43 AM