స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:14 AM
వాతావరణంలో మార్పులతో గురువారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అలాగే గత వారం రోజులు ఉదయం పది గంటల వరకు ఉండే పొగమంచు గురువారం ఉదయం ఆరుగంటలకే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉదయం ఏడు గంటల నుంచే ఎండ మొదలైంది. దీంతో చలి ప్రభావం సైతం కాస్త తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
- జి.మాడుగులలో 8.8 డిగ్రీలు
పాడేరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులతో గురువారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అలాగే గత వారం రోజులు ఉదయం పది గంటల వరకు ఉండే పొగమంచు గురువారం ఉదయం ఆరుగంటలకే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉదయం ఏడు గంటల నుంచే ఎండ మొదలైంది. దీంతో చలి ప్రభావం సైతం కాస్త తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
జి.మాడుగులలో 8.8 డిగ్రీలు
వాతావరణం మారడంతో ఏజెన్సీలో ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించింది. జి.మాడుగులలో బుధవారం 4.6 డిగ్రీలు నమోదుకాగా, గురువారం 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుట్టులో 8.9, డుంబ్రిగుడలో 9.1, చింతపల్లి, అరకులోయలో 9.5, పాడేరులో 9.8, హుకుంపేటలో 10.4, అనంతగిరిలో 14.0, కొయ్యూరులో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.