Share News

రోగులతో పాడేరు ఆస్పత్రి కిటకిట

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:32 AM

భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుత వాతావరణంలో మార్పులతో జనం వైరల్‌ జ్వరాల బారినపడుతున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు.

రోగులతో పాడేరు ఆస్పత్రి కిటకిట
పాడేరు జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఉదయం ఓపీ వద్ద రద్దీ

పాడేరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుత వాతావరణంలో మార్పులతో జనం వైరల్‌ జ్వరాల బారినపడుతున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. సోమవారం సైతం అధిక సంఖ్యలో రోగులు ఆస్పత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో జ్వరబాధితులే అధికంగా ఉంటున్నారు. పది మందిలో కనీసం ఆరుగురు జ్వరంతో బాఽధపడుతున్నవారే ఉంటున్నారు. అలాగే స్థానిక జిల్లా ఆస్పత్రికి రోజుకు 300 నుంచి 400 మంది అవుట్‌ పేషెంట్‌లుగా వచ్చేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం 500 నుంచి 600 వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు. వారిలోనూ 60 శాతం వరకు వైరల్‌ జ్వర బాధితులే ఉంటున్నారు. ఇదే పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొనసాగుతున్నది.

Updated Date - Oct 07 , 2025 | 12:32 AM