అక్కాచెల్లెళ్లకు సికిల్‌సెల్ అనీమియా
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:57 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిన్నపాడు పంచాయతీ గోపవరానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం సికిల్‌సెల్ అనీమియాతో మృతిచెందింది. ఆమె సోదరి కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దవళ దారబాబు, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు భాగ్యశ్రీ (10), యోధశ్రీ (6). ఇద్దరూ సికిల్‌సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు.
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెల్లెలు మృతి
ఆమె సోదరిని కేజీహెచ్‌కు
తరలించాలని వైద్యుల సూచన
కొయ్యూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిన్నపాడు పంచాయతీ గోపవరానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం సికిల్‌సెల్ అనీమియాతో మృతిచెందింది. ఆమె సోదరి కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దవళ దారబాబు, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు భాగ్యశ్రీ (10), యోధశ్రీ (6). ఇద్దరూ సికిల్‌సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు. భాగ్యశ్రీని రెండు రోజుల క్రితం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం యోధశ్రీని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందింది. కాగా భాగ్యశ్రీని మెరుగైన వైద్య సేవల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.