కనక మహాలక్ష్మికి శ్రావణ పూజలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:39 AM
వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
మహారాణిపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):
వన్‌టౌన్‌లోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 85 మంది మహిళలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేయించారు. తొలుత అర్చకులు అమ్మవారిని మేల్కొలిపి ప్రభాతారాధనలు జరి పారు. అనంతరం స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఆ తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈవో శోభారాణి, అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టారు.