వణికిస్తున్న చలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:34 AM
మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది.
ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు
పాడేరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉండడంతో వాహనాదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అయితే తాజా వాతావరణం మాత్రం మన్యాన్ని సందర్శించే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. సోమవారం ముంచంగిపుట్టులో 13.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, జి.మాడుగులలో 13.4, అనంతగిరిలో 14.6, పెదబయలులో 15.2, డుంబ్రిగుడలో 15.6, అరకులోయలో 15.8, పాడేరులో 16.3, హుకుంపేటలో 16.8, చింతపల్లిలో 17.6, కొయ్యూరులో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సోమవారం మండల కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. చలి వలన వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది.