ఆపద్ధర్మ ఎంపీపీగా శకుంతల బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:22 AM
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆపద్ధర్మ ఎంపీపీగా ఉర్మా శకుంతల బాధ్యతలు స్వీకరించారు.
అనంతగిరి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆపద్ధర్మ ఎంపీపీగా ఉర్మా శకుంతల బాధ్యతలు స్వీకరించారు. 11 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రకటించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అప్పటి వరకు ఎంపీపీ పదవిలో కొనసాగిన శెట్టి నీలవేణి పదవిని కోల్పోయారు. ఈ తరుణంలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైస్ ఎంపీపీ-1 ఉర్మా శకుంతలకు ఆపద్ధర్మ ఎంపీపీగా బాధ్యతలను అప్పగిస్తూ జడ్పీ సీఈవో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం శకుంతల బాధ్యతలు చేపట్టగా. పలువురు నేతలు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. ఎంపీడీవో ప్రభాకర్, తోటి సిబ్బంది శకుంతలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.