Share News

డోలీలో ఏడు కిలోమీటర్లు..

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:27 PM

మండలంలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులు, గర్భిణులకు డోలీమోతలు తప్పడం లేదు.

డోలీలో ఏడు కిలోమీటర్లు..
గర్భిణిని డోలీలో మోసుకు వెళుతున్న దృశ్యం

గర్భిణికి తప్పని అవస్థలు

బూసిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు

అనంతగిరి, జూలై 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులు, గర్భిణులకు డోలీమోతలు తప్పడం లేదు. మండలంలోని కొత్తూరు పంచాయతీ బూసిపాడు గ్రామానికి చెందిన గర్భిణి జి.సీతమ్మకు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు బూసుపాడు నుంచి దట్టమైన అటవీప్రాంతం గుండా కొత్తూరు వరకు సుమారు ఏడు కిలో మీటర్లు డోలీలో ఆమెను తీసుకువెళ్లి అక్కడ నుంచి 108 వాహనంలో ఎస్‌కోట ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jul 24 , 2025 | 11:27 PM