Share News

వైసీపీకి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:09 AM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటన రోజే ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, ఆమె సోదరుడు నాగేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి, పలువురు కార్యకర్తలు గురువారం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు.

వైసీపీకి ఎదురుదెబ్బ
మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌. చిత్రంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ వైస్‌చైర్మన్‌ నరసింహమూర్తి, మాజీ చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, టీడీపీ కౌన్సిలర్‌ పద్మావతి.

నర్సీపట్నం మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్లు టీడీపీలో చేరిక

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చింతకాయల విజయ్‌

నర్సీపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటన రోజే ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, ఆమె సోదరుడు నాగేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి, పలువురు కార్యకర్తలు గురువారం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు, చోడవరం ఎమ్మెల్యే రాజు, టీడీపీ కౌన్సిలర్‌ చింత కాయల పద్మావతి.. వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో ఆదిలక్ష్మి 17వ వార్డు నుంచి, నరసింహమూర్తి 5వ వార్డు నుంచి వైసీపీ తరపున కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. తరువాత ఆదిలక్ష్మిని చైర్‌పర్సన్‌గా, నరసింహమూర్తిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకున్నారు. పార్టీ పెద్దల సమక్షంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత వీరు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి వైసీపీతో అంటీముట్టనట్టుగా వుంటున్నారు. వాస్తవంగా 17వ వార్డు కౌన్సిలర్‌ ఆదిలక్ష్మి అయినప్పటికీ, రాజకీయంగా చక్ర తిప్పేది మాత్రం ఆమె సోదరుడు నాగేశ్వరరావు. గత ఎన్నికల్లో ఈ వార్డును ఎస్సీ జనరల్‌కు కేటాయించినప్పటికీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో చైర్‌పర్సన్‌ పదవి కోసంం నాగేశ్వరరావు కౌన్సిలర్‌గా పోటీ చేయకుండా తన సోదరి ఆదిలక్ష్మిని పోటీ చేయించారు. ఎన్నికల అనంతరం ఆమెను చైర్‌పర్సన్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారు. కాగా వైసీపీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్‌ శెట్టి విజయాంబ, ఆమె భర్త శెట్టి మోహన్‌ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. కౌన్సిల్‌లో టీడీపీ బలం 15కి పెరగ్గా, వైసీపీ బలం 11కి తగ్గిపోయింది.

Updated Date - Oct 10 , 2025 | 01:09 AM