వందేమాతం స్ఫూర్తితో దేశ సేవ
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:36 PM
వందేమాతం స్ఫూర్తితో దేశ సేవలకు అంకితం కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
పాడేరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వందేమాతం స్ఫూర్తితో దేశ సేవలకు అంకితం కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. వందేమాత రం గీతం 150 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మన అందరం వందేమాతం స్ఫూర్తితో దేశానికి సేవలు అందించాలన్నారు. ఈ గీతం ఇచ్చిన శక్తితో ప్రతి పౌరుడిలో ఉద్యమ స్ఫూర్తిని పెరిగిందన్నారు. దానిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏవో ఎం.హేమలత, డీఈవో బ్రహ్మాజిరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా ఎస్‌పీ కార్యాలయంలో ఎస్‌పీ అమిత్‌బర్దార్, సిబ్బంది వందేమాతర గీతం ఆలపించారు. కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.