Share News

టీ పెట్టి.. పెన్షన్‌ అందజేసి..

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:24 AM

మండలంలోని ఉద్దండపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని హోం మంత్రి అనిత ప్రారంభించారు.

టీ పెట్టి.. పెన్షన్‌ అందజేసి..
లబ్ధిదారుని ఇంట్లో టీ పెడుతున్న హోం మంత్రి అనిత

- ఉద్దండపురంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన హోం మంత్రి అనిత

నక్కపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉద్దండపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని హోం మంత్రి అనిత ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వృద్ధులు, దివ్యాంగులతో ముచ్చటించారు. ఇటీవల ఆపరేషన్‌ చేయించుకున్న టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. అనంతరం ఆయన ఇంటి వద్ద అనిత టీ పెట్టి, ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. ఆమె వెంట నియోజకవర్గం కూటమి నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్‌, కొండబాబు, గెడ్డం బుజ్జి, లాలం కాశీనాయుడు,కురందాసు నూకరాజు, పెదిరెడ్డి చిట్టిబాబు, అమలకంటి అబద్దం, పెట్ల లింగంనాయుడు, తదితరులు వున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:24 AM