Share News

గిరిజన విద్యార్థులకు ఏ లోటు లేకుండా చూడండి

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:16 AM

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి ఆదేశించారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం సందర్శించారు.

గిరిజన విద్యార్థులకు ఏ లోటు లేకుండా చూడండి
పాడేరు మండలం గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో బాలికలతో ముచ్చటిస్తున్న టీడబ్ల్యూ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి

టీడబ్ల్యూ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి

గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శన

పాడేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి ఆదేశించారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా టీచర్లు, బాలికలతో మాట్లాడారు. అక్కడ అందుతున్న బోధన, సదుపాయాలపై ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:16 AM