Share News

సీలేరులో సీ ప్లేన్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:50 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరులో సీ ప్లేన్‌ ఏర్పాటు కోసం ఆదివారం మరోసారి ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా కంపెనీ నిపుణులు సర్వే నిర్వహించారు.

సీలేరులో సీ ప్లేన్‌
సీలేరు జలాశయంలో సీ ప్లేన్‌ రన్‌వే కోసం డీజీబీఎస్‌ సర్వే నిర్వహిస్తున్న ఫీడ్‌బ్యాక్‌ ఇన్‌ఫ్రా కంపెనీ నిపుణులు

మరోసారి సర్వే చేసిన నిపుణులు

ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా కంపెనీకి టెండరు

రన్‌వే నిర్మాణానికి జలాశయంలో డీజీబీఎస్‌ సర్వే

సీ ప్లేన్‌ ఏర్పాటుకు 8 ప్రాంతాలు ఎంపిక చేసిన

ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

సీలేరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరులో సీ ప్లేన్‌ ఏర్పాటు కోసం ఆదివారం మరోసారి ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా కంపెనీ నిపుణులు సర్వే నిర్వహించారు. ఈ మేరకు సీలేరు జలాశయంపై సీ ప్లేన్‌ రన్‌వే కోసం జలాశయం ఎక్కడెక్కడ ఎంతెంత లోతు ఉందో అన్న వివరాల కోసం డీజీబీఎస్‌ సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీడ్‌ బ్యాక్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఇంజనీర్‌ తన్వీ మాట్లాడుతూ ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రాష్ట్రంలో సీ ప్లేన్‌ ఏర్పాటుకు 8 ప్రాంతాలను ఎంపిక చేశారన్నారు. ఇందులో ప్రకాశం బ్యారేజ్‌, గండిపేట, శ్రీశైలం, కాకినాడు, విశాఖపట్నం, అరకు, జోలాపుట్‌, సీలేరు ప్రాంతాలను ఎంపిక చేశారన్నారు. ఆయా ప్రాంతాల్లో సీ ప్లేన్‌కు రన్‌వే, ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల టెండరు తమ కంపెనీకి రావడంతో జూలై 17న ఒకసారి సీలేరులో సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వే రిపోర్టును ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అందజేశామన్నారు. ఫైనల్‌గా మరోసారి సర్వే నిర్వహించాలన్న ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా జీ ప్లస్‌ 1 భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమి అవసరమని జిల్లా కలెక్టర్‌కు ఏపీఏడీసీ లేఖ పంపిందన్నారు. ఈ భవనంలో పైలట్ల క్యాబిన్‌, ఎలక్ర్టికల్‌ ఎక్యూప్‌మెంట్‌ రూమ్‌, ప్రయాణికుల వెయింటింగ్‌ రూమ్‌, ప్రయాణికుల లగేజీ స్కానింగ్‌ రూమ్‌ తదితర అవసరమైన వాటితో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై డీపీఆర్‌ను తయారు చేస్తామని ఫీడ్‌బ్యాక్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఇంజనీర్‌ తన్వీ తెలిపారు.

Updated Date - Nov 09 , 2025 | 10:50 PM