ఏయూ శతాబ్ది ఉత్సవాలకు షెడ్యూల్
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:16 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్సవాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఆ వివరాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
రానున్న మూడు నెలల్లో సెమినార్లు,
వర్క్‌షాప్‌లు నిర్వహణ
వివరాలు విడుదల చేసిన
వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్
విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్సవాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏడాదిపాటు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఆ వివరాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆగస్టు ఏడో తేదీన న్యాయ కళాశాలలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ధర్మనిధి ప్రసంగం, ఫార్మసీ కళాశాలలో ప్రొఫెసర్ ఇ.వెంకటరావు ఎండోమెంట్ లెక్చర్ ఉంటాయి. 12న ఎకనామిక్స్ విభాగంలో జాతీయ వర్క్‌షాప్, 12, 13 తేదీల్లో ఏయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. 19 నుంచి 21 వరకు ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎఫ్‌డీపీ కార్యక్రమాన్ని, 28 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు క్వాంటం కంప్యూటింగ్‌పై ఎఫ్‌డీపీ కార్యక్రమాన్ని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా సెప్టెంబరు నాలుగు, 15 తేదీల్లో రసాయన శాస్త్రం, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎండోమెంట్ లెక్చర్లు ఏర్పాటుచేశారు. ఏడో తేదీన సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్పెషల్ కాంక్రీట్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అనే అంశంపై జాతీయ సదస్సు. 8 నుంచి 12 వరకు పర్యావరణ శాస్త్ర విభాగంలో సస్టైనబులిటీ యాజ్ ఏ టూల్ ఫర్ రిస్క్ రిడక్షన్ అంశంపై ఎఫ్‌డీపీ కార్యక్రమం. 15, 16 తేదీల్లో సివిల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల ఆధ్వర్యంలో సింపోజియం. 16, 17 తేదీల్లో ఏయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో హై పెర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్‌పై వర్క్‌షాప్. 24 నుంచి 26 వరకు తత్వశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఎక్స్పోరింగ్ ద ఫిలాసఫికల్ లెగసీ ఆఫ్ ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి’ అనే అంశంపై ఇంటర్నేషనల్ సెమినార్. 26, 27 తేదీల్లో బయో కెమెస్ర్టీ విభాగం ఆధ్వర్యంలో టీఎంసీ-2025 కాన్ఫరెన్స్. అక్టోబరు రెండు, మూడు తేదీల్లో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌పై వర్క్‌షాప్. ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కెమిస్ర్టీ విభాగం ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్స్‌స్ ఇన్ కెమికల్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహణ. 22న ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌పై వర్క్‌షాప్. అక్టోబరు 25 నుంచి 28వ తేదీ వరకు రీజనల్ వాలీబాల్ కోచింగ్ వర్క్‌షాప్‌ను అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డీఈ శ్రీధరన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 27 నుంచి 31వ తేదీ వరకు గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్ కమ్యూనికేషన్స్ ప్రోటోకాల్ అండ్ క్రిఫ్టోగ్రఫీ అంశంపై వర్క్‌షాప్. క్లస్టర్ విధానంలో భాగంగా ఎలక్ర్టికల్ సైన్స్, మెకానికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సోషల్ సైన్స్, లా మేనేజ్‌మెంట్ అంశాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. వీటితోపాటు ఏయూ అనుబంధ కళాశాలలను ఒక సమూహంగా ఏర్పాటుచేసి రూరల్ ఔట్రీచ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.