Share News

బీఎన్‌ రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:50 AM

ఆరున్నరేళ్లుగా ఆగిపోయిన బీఎన్‌ రోడ్డు పనులలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రంలో మార్చి నాటికి రోడ్లపై గుంతలు ఉండకూడదని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని చేసిన హెచ్చరికలు తీవ్రంగానే ప్రభావం చూపించాయి. ఫలితంగా బీఎన్‌ రోడ్డు పనులలో కదలిక వచ్చింది. బీఎన్‌ రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలపై ఈనెల 22వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు రహదారులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

బీఎన్‌ రోడ్డుకు మోక్షం
రోడ్డు పక్కల చదును చేస్తున్న దృశ్యం

పనులపై ముఖ్యమంత్రి సమీక్ష

ఎన్‌డీబీ పెండింగ్‌ బిల్లులు విడుదల

చేసిన కూటమి ప్రభుత్వం

రెండు కల్వర్టుల పనులు ప్రారంభం

‘ఆంధ్రజ్యోతి’ కఽథనంతో స్పందించిన ప్రభుత్వం

చోడవరం, నవంబరు 28 (ఆంరఽధజ్యోతి):

ఆరున్నరేళ్లుగా ఆగిపోయిన బీఎన్‌ రోడ్డు పనులలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రంలో మార్చి నాటికి రోడ్లపై గుంతలు ఉండకూడదని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని చేసిన హెచ్చరికలు తీవ్రంగానే ప్రభావం చూపించాయి. ఫలితంగా బీఎన్‌ రోడ్డు పనులలో కదలిక వచ్చింది. బీఎన్‌ రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలపై ఈనెల 22వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు రహదారులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రోడ్డు పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రభావం బీఎన్‌ రోడ్డు పనుల్లో కనిపిస్తున్నది. ప్రధానంగా చోడవరం నుంచి వెంకన్నపాలెం మార్గంలో శిఽథిలావస్థల్లో ఉండి, ప్రమాదాలకు కారణమవుతున్న రెండు కల్వర్టులను నిర్మించే పనులు ప్రారంభించారు. ఈ రెండు కల్వర్టులు కూల్చివేసి కొత్తగా కల్వర్టులు నిర్మించే పనులను చేపట్టారు. అంతవరకూ తాత్కాలికంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, డైవర్షన్‌ రోడ్డు పనులు ప్రారంభించారు.

ఎన్‌డీబీ పనుల పెండింగ్‌ బిల్లులు విడుదల

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీబీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు రూ.276 కోట్లు విడుదల చేసింది. దీంతో ఎన్‌డీబీ పనులు ఊపందుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 11 రోడ్లు ఎన్‌డీబీ నిధులతో చేపట్టి మధ్యలో వదిలేసిన సంగతి తెలిసిందే. పెండింగ్‌ పనులకు సంబంధించి నిధులు విడుదల కావడంతో రోడ్డు పనులు చురుగ్గా సాగే పరిస్థితి ఉందని అంటున్నారు.

అన్ని వర్గాల సమష్టి పోరు

కాగా, బీఎన్‌ రోడ్డు దుస్థితిపై ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బండారు సత్యనారాయణ, జనసేన నేత పీవీఎస్‌ఎన్‌ రాజు తదితరులు ప్రభుత్వానికి చేసిన వినతులు, రోడ్డు పనులపై స్థానిక బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్‌, సీపీఐ, సీపీఎం. ఆమ్‌ ఆద్మీ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డీఎస్‌ ప్రసాద్‌ తదితరులు అనేక రోజులుగా న్యాయపోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక న్యాయవాదులు వేసిన కేసుపై జిల్లా కోర్టు జడ్పి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శులను కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఎన్‌ రోడ్డు ఓ సంచలనంగా మారిపోయింది. అధికార రాజకీయ వర్గాల్లో సైతం ఈ రోడ్డు చర్చనీయాంశంగా మారింది. ఈ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందా? తమ కష్టాలు ఎప్పటికి తీరతాయా అని మూడు జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు బీఎన్‌ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:50 AM