పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:16 AM
పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తుహిన్‌సిన్హా సూచించారు. ఫార్మాసిటీలోని మాన్‌కైండ్ ఫార్మా పరిశ్రమను గురువారం ఆయన సందర్శించారు.
కంపెనీ ప్రతినిధులకు ఎస్పీ తుహిన్‌సిన్హా సూచన
పరవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తుహిన్‌సిన్హా సూచించారు. ఫార్మాసిటీలోని మాన్‌కైండ్ ఫార్మా పరిశ్రమను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సలహాలు, సూచనలు చేశారు. కార్మికులకు ఎల్లప్పుడూ భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. క్రమం తప్పకుండా మాక్‌డ్రిల్ నిర్వహించాలన్నారు. పరిశ్రమలో హౌస్‌కీపింగ్, వ్యర్థ పదార్థాలను శుభ్రపరిచే విధానాన్ని కూడా సమర్థంగా నిర్వహించుకోవాలని చెప్పారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పరిశ్రమ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, పరిశ్రమ కార్పొరేట్ అధికారులు హానీ రిజ్వవి, గౌరవ్‌సింగ్, హెచ్‌ఆర్ మేనేజర్ నరేష్, పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.