Share News

ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ జలమయం

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:58 AM

భారీ వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నీరు నిలిచి చెరువును తలపించింది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ జలమయం
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్లాట్‌ఫారంలోకి చొచ్చుకొస్తున్న వర్షపు నీరు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నీరు నిలిచి చెరువును తలపించింది. కాంప్లెక్స్‌లోకి బస్సులు వచ్చేటప్పుడు ప్లాట్‌ఫారంపైకి నీరు చొచ్చుకు రావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నీటితోపాటు మట్టి కూడా రావడంతో ప్లాట్‌ఫారం మురికి కూపంగా మారింది. వర్షం కారణంగా బస్సులు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచివుండాల్సి వచ్చింది. మెయిన్‌ రోడ్డుకన్నా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణ పల్లంగా ఉండడం, నీరు బయటకు పోవడానికి మార్గం సక్రమంగా లేకపోవడంతో వర్షం కురిస్తే ఆవరణ మొత్తం జలమయం అవుతున్నది.

Updated Date - Aug 27 , 2025 | 12:58 AM