Share News

మొరాయించిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:23 PM

గూడెంకొత్తవీధి మండలం ధారకొండ ఘాట్‌లో డొంకరాయి- పాడేరు ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. దీంతో గంటన్నర పాటు ప్రయాణికులు అడవిలో అవస్థలు పడాల్సి వచ్చింది.

మొరాయించిన ఆర్టీసీ బస్సు
రోడ్డుపై వేచి ఉన్న ప్రయాణికులు

ధారకొండ ఘాట్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికుల పడిగాపులు

సీలేరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి మండలం ధారకొండ ఘాట్‌లో డొంకరాయి- పాడేరు ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. దీంతో గంటన్నర పాటు ప్రయాణికులు అడవిలో అవస్థలు పడాల్సి వచ్చింది. డొంకరాయి నైట్‌ సర్వీసు బస్సు గురువారం వేకువజామున నాలుగు గంటలకు పాడేరులో బయలుదేరింది. ఐదు గంటలకు ధారకొండ ఘాట్‌కు చేరుకుంది. ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య వలన బస్సు ఆగిపోయింది. డ్రైవర్‌ మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అడవిలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉదయం ఆరున్నర గంటలకు సీలేరు నుంచి విశాఖపట్నం ఆర్టీసీ బస్సు రావడంతో ప్రయాణికులను జీకేవీధి వరకు పంపించారు. అక్కడ నుంచి గూడెం, పాడేరు బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఘాట్‌ రోడ్డు ప్రాంతాలకు వస్తున్న ఆర్టీసీ బస్సులు తరచూ ఆగిపోతున్నాయని, ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:23 PM