మూడు రోడ్ల అభివృద్ధికి రూ.3.43 కోట్లు మంజూరు
ABN , Publish Date - May 14 , 2025 | 12:53 AM
చోడవరం నియోజకవర్గంలో మూడు ప్రధానమైన రహదారుల అభివృద్ధికి రూ.3.43 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు మంగళవారం తెలిపారు.
ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
చోడవరం, మే 13 (ఆంధ్రజ్యోతి): చోడవరం నియోజకవర్గంలో మూడు ప్రధానమైన రహదారుల అభివృద్ధికి రూ.3.43 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు మంగళవారం తెలిపారు. బుచ్చెయ్యపేట మండలం రాజాం నుంచి తట్టబంద వరకు 4.3 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.1.4 కోట్లు, ఇదే మండలం గున్నెంపూడి పెదమదీనా నుంచి చింతపాక మీదుగా సీతయ్యపేట వరకు 3.3 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.33 కోట్లు, రావికమతం మండలం కొత్తకోట నుంచి రొచ్చుపణుకు రోడ్డు అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు.