ఆస్పత్రుల అభివృద్ధికి రూ.1.19 కోట్లు మంజూరు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:31 PM
ఏరియా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి పనులకు రూ.1.19 కోట్ల నిధులు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఏరియా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి పనులకు రూ.1.19 కోట్ల నిధులు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పతిలో గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో ఏరియా ఆస్పత్రిలో డ్రైనేజీలు, నీటి సరఫరా పైపులు, ఆపరేషన్ థియేటర్‌కి సెంట్రల్ ఆక్సిజన్ వ్యవస్థ ఏర్పాటు, ఓపీడీ బ్లాక్‌కి ప్రత్యేకంగా మినీసెప్టిక్ ట్యాంక్, ఎలక్ట్రికల్ మరమ్మతులు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి రూ.47 లక్షలు మంజూరు చేశారన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే వేములపూడి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి రూ.5.5 లక్షలు, గుణిపూడి పీహెచ్‌సీకి రూ.2.5 లక్షలు, చీడిగుమ్మల పీహెచ్‌సీకి రూ.8 లక్షలు, నాతవరం పీహెచ్‌సీకి రూ.5.5 లక్షలు, గొలుగొండ పీహెచ్‌సీకి రూ.5 లక్షలు, కృష్ణాదేవిపేట పీహెచ్‌సీకి రూ.5 లక్షలు, పురపాలక సంఘం బొంతువీధి అర్బన్ పీహెచ్‌సీకి రూ.3 లక్షలు, పెదబొడ్డేపల్లి అర్బన్ పీహెచ్‌సీకి రూ.11 లక్షలు, బలిఘట్టం అర్బన్ పీహెచ్‌సీకి రూ.27 లక్షలు... మొత్తం 72.5 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులన్నీ పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.