తిరుగు ప్రయాణాల రద్దీ
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:56 PM
దసరా సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారితో శనివారం ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి.
ఆర్టీసీ బస్సులు కిటకిట
పాయకరావుపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులు ముగియడంతో స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారితో శనివారం ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండు నుంచి జిల్లాలో అనకాపల్లి వరకు, అదే విధంగా కాకినాడ, రాజమహేంద్రవరం వరకు పల్లెవెలుగు సర్వీసులు రోజూ పదుల సంఖ్యలో నడుస్తుండగా, శనివారం బస్టాండుకు వచ్చిన ప్రతి బస్సు ప్రారంభం నుంచే కిక్కిరిసిన ప్రయాణికులతో బయలుదేరాయి. బస్టాండుకు వచ్చిన ప్రతి బస్సులో ప్రయాణికులు దిగకుండానే బస్సు ఎక్కేందుకు ఫుట్‌పాత్ వద్దకు అధిక సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో చిన్నపాటి తోపులాటలు జరిగాయి. దీంతో పిల్లలతో వచ్చినవారు బస్సు ఎక్కేందుకు ఇబ్బందులు పడ్డారు.