కేకే లైన్‌లో జారిపడిన బండరాయి
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:02 PM
విశాఖ- కిరండూల్ రైల్వే లైన్‌లోని టైడా- చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్‌పై బండరాయి పడడంతో ఆదివారం బచేలి నుంచి విశాఖ వస్తున్న గూడ్స్ రైలు యాక్సిల్స్ పట్టాలు తప్పాయి.
పట్టాలు తప్పిన గూడ్స్
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
మధ్యాహ్నం నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు
అనంతగిరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖ- కిరండూల్ రైల్వే లైన్‌లోని టైడా- చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్‌పై బండరాయి పడడంతో ఆదివారం బచేలి నుంచి విశాఖ వస్తున్న గూడ్స్ రైలు యాక్సిల్స్ పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ ఘటనతో విశాఖ-కిరండూల్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను రద్దుచేశారు. కిరండూల్ నుంచి వచ్చే గూడ్స్ రైళ్లను కోరాపుట్, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం మళ్లించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సంఘటన జరగ్గా, 11.20 గంటలకు పట్టాలను పునరుద్ధరించారు. మఽధ్యాహ్నం 12 గంటల తరువాత కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగాయి. కాగా ర్యాక్ కొరత కారణంగా కిరండూల్ నుంచి విశాఖ వచ్చే 58502 నంబరుగల రైలును సోమవారం (20న) రద్దుచేశారు.