గంగవరం పోర్టు రోడ్డులో దోపిడీ
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:44 AM
లారీలో నిద్రిస్తున్న డ్రైవర్లను కత్తితో బెదిరించి, దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన బుధవారం వేకువజామున గంగవరం పోర్టు రోడ్డులో చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

లారీ డ్రైవర్లను కత్తితో బెదిరించి రూ.3,500 నగదు,
రెండు సెల్ ఫోన్లతో ఉడాయించిన దుండగులు
గాజువాక, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): లారీలో నిద్రిస్తున్న డ్రైవర్లను కత్తితో బెదిరించి, దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన బుధవారం వేకువజామున గంగవరం పోర్టు రోడ్డులో చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన అభిశంత్, జార్జండ్‌కు చెందిన ఇంతిజ్ అన్సారీలు గంగవరం పోర్టు రోడ్డులో మంగళవారం రాత్రి తమ లారీలను నిలిపివేసి ఎవరి వాహనంలో వారు నిద్రించారు. అయితే వేకువజాము నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో వారిని బెదిరించి, వారి వద్దనున్న రూ.3,500 నగదు, రెండు సెల్ ఫోన్లను లాక్కుని పారిపోయారు. దీంతో ఆ ఇద్దరు డ్రైవర్లు గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి అప్పికొండ, మదీనాబాగ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.