చందాలతో వీరవరానికి రోడ్డు
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:07 PM
మండలంలోని జీకేవీధి పంచాయతీ వీరవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు చందాలు వేసుకుని ఎక్స్‌కవేటర్ సాయంతో గ్రావెల్ రోడ్డును వేసుకున్నారు.
జన్‌మన్ ఇళ్ల మెటీరియల్ తరలించేందుకు
ఇబ్బంది పడుతున్న గిరిజనులు
ఇంటికి రెండు వేలు వేసుకొని
రోడ్డు వేసుకున్న గిరిజనులు
గూడెంకొత్తవీధి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జీకేవీధి పంచాయతీ వీరవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు చందాలు వేసుకుని ఎక్స్‌కవేటర్ సాయంతో గ్రావెల్ రోడ్డును వేసుకున్నారు. గ్రామంలో 35 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి రహదారి సదుపాయం లేదు. తాజాగా కూటమి ప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేసింది. గృహాల నిర్మాణ సామగ్రిని తరలించుకునేందుకు ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు మార్లు అధికారులు, పాలకులకు రహదారి సదుపాయం కల్పించాలని అందజేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఒక్కొక్క గిరిజన కుటుంబం రూ.రెండు వేలు చొప్పున చందాలు వేసుకుని శుక్రవారం ఎక్స్‌కవేటర్‌తో రహదారిని నిర్మించుకున్నారు. ప్రభుత్వం గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని స్థానిక గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.