లక్ష్యం దిశగా వరి సాగు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:58 AM
జిల్లాలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. గత రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. చాలాచోట్ల కాలువల నీటి అవసరం లేకుండా, పొలాల్లో చేరిన వర్షం నీటితోనే వరినాట్లు వేసుకుంటున్నారు. నీటి వసతి వున్న ప్రాంతాలతోపాటు వర్షాధార భూముల్లో కూడా వరినాట్లు వేస్తుండడంతో పరిస్థితి ఆశాజనకంగా వుంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 54,465 హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
కీలక సమయంలో కరుణించిన వరుణుడు
రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలతో జోరుగా వరినాట్లు
ఎరువుల కొరత లేకుండా అధికారుల చర్యలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. గత రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. చాలాచోట్ల కాలువల నీటి అవసరం లేకుండా, పొలాల్లో చేరిన వర్షం నీటితోనే వరినాట్లు వేసుకుంటున్నారు. నీటి వసతి వున్న ప్రాంతాలతోపాటు వర్షాధార భూముల్లో కూడా వరినాట్లు వేస్తుండడంతో పరిస్థితి ఆశాజనకంగా వుంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 54,465 హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి 41,546 హెక్టార్లలో వరినాట్లు పూర్తయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నాతవరం మండలంలో 4,590 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయి. తరువాత దేవరాపల్లి మండలంలో 3,812 హెక్టార్లు, మాడుగుల మండలంలో 3,638, కె.కోటపాడులో 2,453, చీడికాడలో 2,872, అనకాపల్లిలో 2,100, రావికమతంలో 2,097, పాయకరావుపేటలో 2,036, బుచ్చెయ్యపేటబ 1,882, ఎస్.రాయవరంలో 1,842, నర్సీపట్నంలో 1,516, రోలుగుంటలో 1,518, సబ్బవరంలో 1,140, గొలుగొండలో 1,074, నక్కపల్లిలో 1,334, కోటవురట్లలో 1,271, మాకవరపాలెంలో 1,115, కశింకోటలో 640, మునగపాకలో 971, చోడవరంలో 1,698, ఎలమంచిలిలో 762, అచ్యుతాపురంలో 320, రాంబిల్లిలో 738, పరవాడలో 123 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో వారం రోజుల్లో వరినాట్లు పూర్తవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.