వర్షంతో ఊరట
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:03 PM
పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దఫదఫాలుగా సాయంత్రం వరకు వర్షం కొనసాగింది. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది.
అరకులోయ, జూలై 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దఫదఫాలుగా సాయంత్రం వరకు వర్షం కొనసాగింది. దీంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. వర్షం కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా చోడి రైతులు ఆనందపడ్డారు. ఎండ కారణంగా చోడి పంట ఎండిపోతుందని బాధపడుతున్న రైతులు ఊరట చెందారు.