Share News

నిండుకుండలా జలాశయాలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:47 PM

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలు ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.

నిండుకుండలా జలాశయాలు
వరద నీరు చేరడంతో నిండుకుండలా ఉన్న జోలాపుట్టు జలాశయం

జోలాపుట్టు, డుడుమ నుంచి నీరు విడుదల

ముంచంగిపుట్టు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలు ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ రెండు జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, ఆదివారం 2,747.95 అడుగులకు చేరింది. ఇక్కడ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,580.10 అడుగులకు చేరింది. ఈ జలాశయం నుంచి బలిమెలకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 10:47 PM