Share News

జలాశయాలు కళకళ

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:37 AM

జిల్లాలోని జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు చేరడంతో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.

జలాశయాలు కళకళ
వరద నీటితో కళకళలాడుతున్న రైవాడ జలాశయం

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెరిగిన నీటిమట్టాలు

అనకాపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు చేరడంతో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జలాశయాల్లో నీటి నిల్వలు లేక రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు భారీ వర్షాలు కురవడంతో సాగునీటి కష్టాలు ఉండవని భావిస్తున్నారు. రైవాడ, తాండవ, పెద్దేరు, కోనాం, వరహా జలాశయాల్లో గతేడాది కంటే ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నీటిమట్టం ఎక్కువగా ఉంది. తాండవ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 380 అడుగులు కాగా, మంగళవారం నాటికి 375.55 అడుగులు ఉంది. రైవాడ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం 113.18 మీటర్లు ఉంది. కోనాం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 99.6 మీటర్లు, వరహా జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 460 అడుగులు కాగా, ప్రస్తుతం 451.7 అడుగులు, పెద్దేరు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 135.95 మీటర్లు ఉంది. జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తుండడంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని జలాశయాల నీటి సామర్థ్యం, మంగళవారం నాటికి నిల్వలు ఇలా..

-----------------------------------------------------------------

జలాశయం పూర్తి సామర్థ్యం ప్రస్తుత నిల్వ

-----------------------------------------------------------------

తాండవ 380.00 అడుగులు 375.55 అడుగులు

రైవాడ 114.00 మీటర్లు 113.18 మీటర్లు

కోనాం 101.25 మీటర్లు 99.6 మీటర్లు

వరహా 460.00 అడుగులు 451.7 అడుగులు

పెద్దేరు 137.00 మీటర్లు 135.95 మీటర్లు

---------------------------------------------------------------

Updated Date - Aug 20 , 2025 | 12:37 AM