రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:43 AM
అచ్యుతాపురం సెజ్ పరిధిలోని రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్‌గాట్ అండ్ వేఫర్ (సోలార్ పలకల తయారీ) పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 140 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు గురువారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గసమావేశం ఆమోదించింది.
రూ.3,990 కోట్లతో సోలార్ పలకల తయారీ పరిశ్రమ
140 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
విద్యుత్తు, నీరు, పన్నుల్లో రాయితీలు
2028 జనవరి నాటికి ఉత్పత్తి ప్రారంభం
1,200 మందికి ఉద్యోగ అవకాశాలు
అనకాపల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
అచ్యుతాపురం సెజ్ పరిధిలోని రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్‌గాట్ అండ్ వేఫర్ (సోలార్ పలకల తయారీ) పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 140 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు గురువారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గసమావేశం ఆమోదించింది. రెన్యూ ఫొటోవాల్టిక్ (సోలార్) ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సోలార్ పీవీ ఇన్‌గాట్ వేఫర్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమితోపాటు 37.51 శాతం కేపిటల్ సబ్సిడీ, 10 ఏళ్లపాటు విద్యుత్ డ్యూటీ మినహాయింపు, ఒక యూనిట్ విద్యుత్తుకు రూపాయి సబ్సిడీ, స్టాంపు డ్యూటీ మినహాయింపు, నీటి వినియోగ చార్జీల్లో రాయితీలు ఇవ్వనున్నది. ఈ కంపెనీలో మొత్తం 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2028 జనవరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు.