Share News

లక్ష్యానికి దూరంగా రిజిస్ర్టేషన్లు

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:26 AM

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు నెలాఖరు వరకు రూ.771.65 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

లక్ష్యానికి దూరంగా రిజిస్ర్టేషన్లు

ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ లక్ష్యం రూ.898.81 కోట్లు

వచ్చింది రూ.771.65 కోట్లు

85.85 శాతమే సాధన

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం 13.29 శాతం వృద్ధి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు నెలాఖరు వరకు రూ.771.65 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.681.11 కోట్లు ఆదాయం వచ్చింది. దాంతో పోల్చితే 13.29 శాతం వృద్ధి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం పరంగా చూసుకుంటే 85.85 శాతమే సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం రూ.1,357.85 కోట్లు కాగా నవంబరు చివరికి ఇచ్చిన లక్ష్యం రూ.898.81 కోట్లు. అందులో నవంబరు నెలాఖరు నాటికి రూ.771.65 కోట్లు మాత్రమే సాధించారు. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కొద్దిరోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి లక్ష్యాలను 100 శాతం సాధించడానికి ప్రతి కార్యాలయం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎక్కడెక్కడ లోపాలున్నాయో, ఏయే రిజిసే్ట్రషన్లు జాప్యం జరుగుతున్నాయో గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం పెట్టుబడులకు అనుకూలంగా ఉండడం వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని, తద్వారా రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా విస్తరిస్తున్నదని, అవన్నీ కార్యరూపంలోకి వచ్చేందుకు ఒప్పందాలు పురోణి స్థాయిలో ఆగిపోకుండా రిజిస్ట్రేషన్ల వరకు వచ్చేలా చూడాలని సూచించారు.

కార్యాలయాల వారీగా ఆదాయం...నవంబరులో చేసిన డాక్యుమెంట్లు

--------------------------------------------------------------------------------------

కార్యాలయం లక్ష్యం ఆదాయం డాక్యుమెంట్లు

--------------------------------------------------------------------------------------

గోపాలపట్నం రూ.46.09 కోట్లు రూ.30.69 కోట్లు 685

ద్వారకానగర్‌ రూ.94.21 కోట్లు రూ.69.32 కోట్లు 769

పెదగంట్యాండ రూ.75.65 కోట్లు రూ.52.97 కోట్లు 1,745

సూపర్‌బజార్‌ రూ.219.35 కోట్లు రూ.172.24 కోట్లు 2,142

పెందుర్తి రూ.63.83 కోట్లు రూ.52.79 కోట్లు 747

ఆనందపురం రూ.51.82 కోట్లు రూ.48.41 కోట్లు 835

గాజువాక రూ.86.79 కోట్లు రూ.86.28 కోట్లు 820

భీమిలి రూ.53.07 కోట్లు రూ.50.36 కోట్లు 728

మధురవాడ రూ.208.00 కోట్లు రూ.200.58 కోట్లు 1,791

--------------------------------------------------------------------------------------

Updated Date - Dec 16 , 2025 | 01:26 AM