Share News

రిజిస్ట్రేషన్ల ఆదాయం భేష్‌

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:11 AM

స్థిరాస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే నక్కపల్లి, ఎలమంచిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.319 కోట్ల ఆదాయంగా లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం సెప్టెంబరు 30 వరకు నిర్దేశించిన లక్ష్యం 160.39 కోట్లు కాగా, రూ.171.65 కోట్ల ఆదాయం వచ్చింది. అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు మిగిలిన 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ సగటున రోజుకు 40 నుంచి 60 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిసే్ట్రషన్లు పెరగడానికి ప్రధాన కారణం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చిన మార్కెట్‌ విలువ హేతుబద్ధీకరణేనని పలువురు అంటున్నారు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం భేష్‌
అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు లక్ష్యం రూ.160.39 కోట్లు, ఆదాయం రూ.171.65 కోట్లు

- గత మూడు నెలల్లో ఆదాయం వృద్ధి 107.23 శాతం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

స్థిరాస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే నక్కపల్లి, ఎలమంచిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.319 కోట్ల ఆదాయంగా లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం సెప్టెంబరు 30 వరకు నిర్దేశించిన లక్ష్యం 160.39 కోట్లు కాగా, రూ.171.65 కోట్ల ఆదాయం వచ్చింది. అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు మిగిలిన 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ సగటున రోజుకు 40 నుంచి 60 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిసే్ట్రషన్లు పెరగడానికి ప్రధాన కారణం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చిన మార్కెట్‌ విలువ హేతుబద్ధీకరణేనని పలువురు అంటున్నారు.

గత మూడు నెలల్లో ఆదాయం పెరుగుదల

జిల్లాలో సెప్టెంబరు నెలాఖరు నాటికి మూడు నెలలకు గాను రూ.78.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ మూడు నెలల్లో ఆదాయం వృద్ధి 107.23 శాతంగా నమోదైంది. అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అత్యధికంగా రూ.15.14 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నక్కపల్లి కార్యాలయంలో రూ.8.75 కోట్లు, ఎలమంచిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.10.06 కోట్ల ఆదాయం సమకూరింది. తక్కువగా కె.కోటపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.2.90 కోట్ల ఆదాయం వచ్చింది.

Updated Date - Oct 12 , 2025 | 01:11 AM