అల్లూరి జిల్లాలో 30 మంది వైద్యుల నియామకం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:31 PM
అల్లూరి సీతారామారాజు పాడేరు జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న 30 వైద్యాధికారుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.టి.విశ్వేశ్వరరావునాయుడు తెలిపారు.
పది మంది విధుల్లో చేరిక
పాడేరురూరల్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామారాజు పాడేరు జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న 30 వైద్యాధికారుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.టి.విశ్వేశ్వరరావునాయుడు తెలిపారు. వీరిలో 10 మంది వైద్యులు శుక్రవారం జాయిన్ అయ్యారని ఆయన చెప్పారు. శుక్రవారం పోస్టింగ్ ఆర్డర్‌తో డీఎంహెచ్‌వో కార్యాలయానికి పది మంది రాగా.. వారికి మూమెంట్ ఆర్డర్ అందజేశామన్నారు. వారికి కేటాయించిన పీహెచ్‌సీలలో విధులలో చేరడం జరిగిందన్నారు. మిగిలిన 20 మంది వైద్యాధికారులు రిపోర్టు చేయాల్సి ఉందన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన డీఎంహెచ్‌వో ఆదివాసీలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు వ్యాధి, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సీహెచ్.కమలకుమారి పాల్గొన్నారు.