అనకాపల్లిలో నిలిచిన రాయగడ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:13 AM
విజయనగరం స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రభావం గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌పై పడింది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సుమారు నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం చెందారు.
నాలుగు గంటలపాటు ఇబ్బంది పడిన ప్రయాణికులు
అనకాపల్లి టౌన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విజయనగరం స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రభావం గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌పై పడింది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో సుమారు నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం చెందారు. ఉదయం ఏడు గంటలకు అనకాపల్లి వచ్చిన గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరింది. దువ్వాడ, విశాఖపట్నం వరకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇక్కడ రైలు దిగేసి, రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ వెళ్లే ప్రయాణికులు మాత్రం రైలులోనే వుండిపోయారు.