వృద్ధులు, దివ్యాంగుల ఇంటికే రేషన్
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:18 PM
జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ సరుకుల పంపిణీ చేస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరు, జూన్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ సరుకుల పంపిణీ చేస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. పాడేరులోని సుండ్రుపుట్టు వీధిలో మంగళవారం ఓ వృద్ధుడి ఇంటికి వెళ్లి కలెక్టర్ రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు రేషన్ దుకాణాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ బి.గణేశ్‌కుమార్, స్థానిక తహశీల్దార్ వి.త్రినాథరావునాయుడు, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ ఒ.ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.