Share News

రేషన్‌ పంపిణీ కమీషన్‌ పెంచాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:22 PM

రేషన్‌ పంపిణీ చేసే తమ కమీషన్‌ పెంచాలని రేషన్‌ డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన జిల్లా రేషన్‌ డీలర్ల సమావేశంలో పలువురు మాట్లాడారు.

రేషన్‌ పంపిణీ కమీషన్‌ పెంచాలి
అనకాపల్లిలో సమావేశమైన రేషన్‌ డీలర్లు

ప్రభుత్వానికి డీలర్ల విజ్ఞప్తి

అనకాపల్లి టౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ పంపిణీ చేసే తమ కమీషన్‌ పెంచాలని రేషన్‌ డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన జిల్లా రేషన్‌ డీలర్ల సమావేశంలో పలువురు మాట్లాడారు. ఎండీయూలను ఆపేసి, పాత విధానంలోనే డిపోల ద్వారా కార్డుదారులకు సరకులు పంపిణీ చేసే విధానాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తోపాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో సరకులు అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొప్పాక శేషు, కార్యదర్శి కె.రామ్మోహనరావు, వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.నాయుడు, కోశాధికారిమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:23 PM