Share News

గిరిజన మహిళా రైతుకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:51 PM

మండలంలోని జర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళా యువ రైతు అడపా లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది.

గిరిజన మహిళా రైతుకు అరుదైన గౌరవం
రాష్ట్ర స్థాయి రైతు నేస్తం అవార్డును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వరరావు నుంచి అందుకుంటున్న అడపా లక్ష్మి

రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డు అందుకున్న అడపా లక్ష్మి

గూడెంకొత్తవీధి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళా యువ రైతు అడపా లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. సేంద్రీయ పద్ధతిలో కాఫీ సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించడంతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతుగా ఎంపికై ‘రైతు నేస్తం’ అవార్డును అందుకుంది. అడపా లక్ష్మి వారసత్వంగా వచ్చిన రెండెకరాల కాఫీ తోటను కొన్నేళ్లుగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నది. కాఫీ గింజలను ఆర్గానిక్‌ ఉత్పత్తులుగా గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెటింగ్‌ చేసింది. కిలోకి గరిష్ఠంగా రూ.400 ధర లభించింది. లక్ష్మి కాఫీ సాగులో పలువురికి ఆదర్శంగా నిలవడంతో ఆమె సేవలను గుర్తించిన పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్‌ నిర్వాహకులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ రైతుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ స్వర్ణభారతి ట్రస్టులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతు నేత్తం అవార్డును లక్ష్మికి నిర్వాహకులు అందజేశారు. తనకు ఈ పురస్కరం లభించడం చాలా సంతోషంగా ఉందని, గిరిజన ప్రాంతంలో సేంద్రీయ కాఫీ సాగు విస్తరణకు తన వంతు కృషి చేస్తారని లక్ష్మి తెలిపింది.

Updated Date - Oct 26 , 2025 | 10:51 PM