రాజాధిరాజ వాహనంపై రమణుడు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:54 AM
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉపమాక క్షేత్రంలో ఆదివారం రాజాధిరాజ వాహనంపై రమణుడి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఉభయదేవేరులతో కూడిన స్వామివారు, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి మాఢవీధుల్లో ఊరేగించారు.
ఉపమాకలో ఘనంగా స్వామివారి తిరువీధి సేవ
నక్కపల్లి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉపమాక క్షేత్రంలో ఆదివారం రాజాధిరాజ వాహనంపై రమణుడి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఉభయదేవేరులతో కూడిన స్వామివారు, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి మాఢవీధుల్లో ఊరేగించారు. స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై పాశుర విన్నపం చేశారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.