పీజీఆర్‌ఎస్ అర్జీలకు సత్వర పరిష్కారం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:23 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌వో వై.సత్యనారాయణరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలువురి సమస్యలను స్వయంగా ఆలకించి, పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. నిబంధనలకు లోబడి సమస్యలను పరిష్కరించే అవకాశం వున్న అర్జీలను వెంటనే క్లియర్ చేయలన్నారు. ఒకవేళ పరిష్కారం చేయడానికి వీలుకాకపోతే అందుకుగల కారణాలను వివరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 232 అర్జీలు అందాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
అనకాపల్లి రూరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో అందే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యను ఆలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందిన అర్జీలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి, న్యాయపరంగా ఇబ్బందులు లేనివాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో 32 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు.