పుడమి తల్లి.. పసుపుపచ్చ చీరకట్టి..
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:22 AM
ప్రస్తుతం మన్యంలో పసుపు పచ్చని వలిసె పువ్వుల సౌందర్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. నిర్మలంగా ఉన్న నీలి ఆకాశం.. ఆకుపచ్చని పచ్చని చెట్లు.. పుడమి తల్లి పసుపు పచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా పంట పొలాల్లో విరబూసిన వలిసె పూలతో ఏజెన్సీలోని సహజ సిద్ధమైన అందాలు పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి.
మన్యంలో వికసించిన వలిసె పూలు
ప్రస్తుతం మన్యంలో పసుపు పచ్చని వలిసె పువ్వుల సౌందర్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. నిర్మలంగా ఉన్న నీలి ఆకాశం.. ఆకుపచ్చని పచ్చని చెట్లు.. పుడమి తల్లి పసుపు పచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా పంట పొలాల్లో విరబూసిన వలిసె పూలతో ఏజెన్సీలోని సహజ సిద్ధమైన అందాలు పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి. వీటికితోడు ఉదయంపూట మంచుతెరల అందాలను చూసి పరవశం చెందుతున్నారు. పాడేరు- అరకులోయ జాతీయ రహదారిలో హుకుంపేట మండలం రంగశీల, బొడిగపుట్టు, డుంబ్రిగుడ మండలం కించుమండ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్న వలిసె పూల అందాలను ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాలో బంఽధించింది. -ఆంధ్రజ్యోతి/పాడేరు