Share News

పీటీడీ కాంప్లెక్‌ కిటకిట

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:45 PM

దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు, మైదాన ప్రాంతం నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంతో పాడేరు పీటీడీ కాంప్లెక్స్‌, ప్రైవేటు జీపుల స్టాండ్‌లు శుక్రవారం ఉదయం నుంచి రద్దీగా మారాయి.

పీటీడీ కాంప్లెక్‌ కిటకిట
తిరుగు ప్రయాణీకులతో రద్దీగా మారిన పీటీడీ కాంప్లెక్స్‌

దసరా సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణికులతో రద్దీ

బస్సులు తక్కువగా ఉండడంతో గంటల సేపు నిరీక్షణ

పాడేరురూరల్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు, మైదాన ప్రాంతం నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంతో పాడేరు పీటీడీ కాంప్లెక్స్‌, ప్రైవేటు జీపుల స్టాండ్‌లు శుక్రవారం ఉదయం నుంచి రద్దీగా మారాయి. విశాఖ, అనకాపల్లి, గుంటూరు, చోడవరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు, మైదాన ప్రాంతంలో ఉద్యోగ, జీవన భృతి కోసం నివసించేవారు దసరా సెలవులకు స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్లేందుకు పాడేరు వచ్చారు. వారు రాకతో పాడేరు పీటీడీ కాంప్లెక్స్‌, జీపుల స్టాండ్‌లు కిటకిటలాడాయి. బస్సులు తక్కువగా ఉండడంతో కాంప్లెక్స్‌లో ప్రయాణికులు గంటల సేపు నిరీక్షించారు. చింతపల్లి, జి.మాడుగుల, అరకు తదితర ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పీటీడీ బస్సులు, ప్రైవేటు వాహనాలు రద్దీగా ఉన్నాయి.

Updated Date - Oct 03 , 2025 | 11:45 PM