బీఎన్ రోడ్డుకు మోక్షం కల్పించండి
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:28 AM
తన నియోజకవర్గంలో ప్రధానమైన బీఎన్ రోడ్డును త్వరగా అభివృద్ధి చేసి ప్రయాణికలు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు శుక్రవారం శాసనసభల్లో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
వడ్దాది, విజయరామరాజుపేటల వద్ద వంతెనలు నిర్మించాలి
గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలి
శాసనసభలో ప్రభుత్వానికి ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు వినతి
చోడవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తన నియోజకవర్గంలో ప్రధానమైన బీఎన్ రోడ్డును త్వరగా అభివృద్ధి చేసి ప్రయాణికలు, వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు శుక్రవారం శాసనసభల్లో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అధ్వానంగా తయారైన ఈ రహదారిలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. మరోవైపు వడ్డాది, విజయరామరాజుపేటల వద్ద వంతెనలు కూలిపోయాయని, తాత్కాలికంగా నిర్మించిన కాజ్‌వేల వరద ధాటికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయరామరాజుపేట కాజ్‌వే వద్ద రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయి మృతిచెందారని అన్నారు. ఈ రెండుచోట్ల వెంటనే వంతెనలు నిర్మించాలని కోరారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలతోపాటు, కార్మికులకు వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.