గోవాడ షుగర్స్ పరిరక్షణకు 17న నిరసన దీక్ష
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:49 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఈ నెల 17న నిరసన దీక్ష చేపట్టాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. గురువారం ఫ్యాక్టరీ వద్ద సమావేశమైన నేతలు.. రైతులు, కార్మికుల బకాయిలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు కర్రి అప్పారావు మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీని నడిపించేందుకు అవసరమైన నిఽధులను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చెరకు రైతులు, కార్మికులకు బకాయిల చెల్లింపు కోసం రూ.35 కోట్లు అత్యవసరంగా విడుదల చేయాలని కోరారు.
రైతు, కార్మిక సంఘాల నేతల ప్రకటన
చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్
అత్యవసరంగా రూ.35 కోట్లు విడుదల చేయాలని వినతి
చోడవరం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఈ నెల 17న నిరసన దీక్ష చేపట్టాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. గురువారం ఫ్యాక్టరీ వద్ద సమావేశమైన నేతలు.. రైతులు, కార్మికుల బకాయిలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు కర్రి అప్పారావు మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీని నడిపించేందుకు అవసరమైన నిఽధులను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చెరకు రైతులు, కార్మికులకు బకాయిల చెల్లింపు కోసం రూ.35 కోట్లు అత్యవసరంగా విడుదల చేయాలని కోరారు. ఫ్యాక్టరీలో క్రషింగ్‌ను కొనసాగించేందుకు రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు మాట్లాడుతూ, వేతనాలు లేక, భవిష్యత్తు ఏమిటో అర్థం కాక కార్మికులు ఆందోళన చెందుతున్నారని, అందువల్ల షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రైతు సంఘం నాయకుడు దండుపాటి తాతారావు మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, రైతులు, కార్మికుల బకాయిల సాధన కోసం 17వ తేదీ నిరసన దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం చెరకు రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహాజన సభను ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీ భవితవ్యంపై ప్రభుత్వం,, ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు ఏడువాక శ్రీనివాసరావు, తనకల జగన్, కొణతాల పెదప్పడు, గంగేశ్వరరావు, మల్ల కోటేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు.