హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:53 PM
అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ గుజ్టెలి గ్రామంలో ఏర్పాటు చేయనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆదివారం గిరిజనులు ఆందోళన చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అరకులోయ మండలం లోతేరు, ఇరగాయి పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో సరిహద్దు దిమ్మలు ఏర్పాటు చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దిమ్మలను తొలగించారు.
సరిహద్దు దిమ్మను ధ్వంసం చేసిన గిరిజనులు
అరకులోయ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ గుజ్టెలి గ్రామంలో ఏర్పాటు చేయనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆదివారం గిరిజనులు ఆందోళన చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అరకులోయ మండలం లోతేరు, ఇరగాయి పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో సరిహద్దు దిమ్మలు ఏర్పాటు చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దిమ్మలను తొలగించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు పొద్దు బాలదేవ్, గత్తుం బుజ్జిబాబు అప్పలస్వామి, కిల్లో రామన్న మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వలన అంటిపర్తి, దూద్‌కొండి, మొర్రిగుడ, కాగువలస, తొరడంవలస, ముసిరిగుడ, పొల్లిగుడ, అడ్డుమండ, దౌడగుడ, తదితర 14 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అనంతగిరి మండలం గుజ్జెలి గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న హైడ్రో ప్రాజెక్టుకు అరకులోయ మండలం శివారు పంచాయతీలు లోతేరు, ఇరగాయి పరిధిలోని గ్రామాలు భౌగోళికంగా సమీప గ్రామాలు కావడంతో వీటిని ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకు వచ్చారన్నారు. దీనిని అడ్డుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.