సక్రమంగా రెవెన్యూ సేవలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:46 AM
జిల్లా ప్రజలకు రెవెన్యూ సేవలను సక్రమంగా అందించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. రెవెన్యూ, పీజీఆర్‌ఎస్ సేవలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించాలన్నారు.
- అధికారులకు కలెక్టర్ ఆదేశం
- మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన
పాడేరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు రెవెన్యూ సేవలను సక్రమంగా అందించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. రెవెన్యూ, పీజీఆర్‌ఎస్ సేవలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించాలన్నారు. అలాగే భూముల మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలన్నారు. భూముల రీసర్వేను సకాలంలో పూర్తి చేయాలని, ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు. అటవీ, రెవెన్యూ భూముల సర్వేకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కలెక్టర్ సూచించారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ఆయన మండలాల వారీగా సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్ అర్జీలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో రేషన్ డిపోల తనిఖీలు, పేదలకు ఇళ్ల స్థలాల ఎంపిక, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టడం, ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడం వంటివాటిపై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభ నొక్వాల్, జిల్లాలోని 22 మండలాలకు చెందిన తహశీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.