పక్కాగా అర్జీల నమోదు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:34 AM
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు (పీజీఆర్‌ఎస్) వచ్చే అర్జీల నమోదు ప్రక్రియ, వాటి పరిష్కార మార్గాలను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు (పీజీఆర్‌ఎస్) వచ్చే అర్జీల నమోదు ప్రక్రియ, వాటి పరిష్కార మార్గాలను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం డీఆర్‌వో వై.సత్యనారాయణరావుతో కలిసి పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 344 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, వీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించింది, లేనిదీ నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్, డీఈవో అప్పారావునాయుడు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
అనకాపల్లి రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై 36 వినతిపత్రాలను అందజేశారు.