Share News

ధాన్యం కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:15 AM

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో తూనికల పరికరాలను సిద్ధం చేసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు
మాట్లాడుతున్న జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ

ఆర్‌ఎస్‌కేల్లో తూనిక యంత్రాలను సిద్ధం చేసుకోండి

అధికారులకు జేసీ అభిషేక్‌ గౌడ ఆదేశం

పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో తూనికల పరికరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తాత్కాలికంగా నిల్వ చేసేందుకు, తరువాత రైస్‌ మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాటు చేసుకోవాలిన జేసీ చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేర్చేలోపు తడవకుండా వుండేందుకు అవసరమైన టార్పాలిన్లు సమకూర్చుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాగుల కొనుగోలుపైనా అధికారులు దృష్టి సారించాలని జేసీ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ వి.మోహనరావు, జిల్లా సహకార శాఖాధికారి రామకృష్ణరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 01:15 AM